Jayadev Unadkat: వేడుకగా సాగిన క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ వివాహం!

Jayadev Unadkat Marriage With Rinni
  • గుజరాత్ లోని మధుబన్ రిసార్టులో వివాహం
  • పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఉనద్కత్
  • న్యాయవాదిగా పని చేస్తున్న రిన్నీ కంటారియా

మిగతా క్రికెటర్ల మాదిరిగా ప్రేమ వివాహం జోలికి పోకుండా, పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడు టీమిండియా యువ పేస్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్. గుజరాత్ లోని ఆనంద్ లో ఉన్న మధుబన్ రిసార్ట్ లో కుటుంబీకులు, బంధుమిత్రుల మధ్య, న్యాయవాదిగా పని చేస్తున్న రిన్నీ కంటారియా మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరికి గతసంవత్సరం మార్చి 15న నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

ఇక తన వివాహం జరిగిందన్న విషయాన్ని ట్విట్టర్ లో పేర్కొన్న ఉనద్కత్, "ఫిబ్రవరి 2, 2021న మా వివాహం జరిగింది. సన్నిహితులు, స్నేహితులు, బంధువుల మధ్య పెళ్లి చేసుకున్నాను. అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మేము కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాము. మీ ఆశీర్వాదం కావాలి" అని కోరాడు.

ఇక ఈ వివాహానికి ముందు జరిగిన సంగీత్ వేడుకకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ తో పాటు, దేశవాళీ క్రికెట్ లో ఉనద్కత్ ఎంతగా రాణిస్తున్నా, భారత క్రికెట్ జట్టులో మాత్రం ఇంకా చోటు లభించలేదు. ఉనద్కత్ వివాహం నేపథ్యంలో, అతను త్వరలోనే టీమిండియా తరఫున ఆడే అవకాశం లభిస్తుందని ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.

 కాగా, ప్రస్తుతం జయదేవ్ ఉనద్కత్, ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. 2021 సీజన్ లోనూ ఉనద్కత్ ను తమ జట్టులోనే కొనసాగించాలని నిర్ణయించుకున్న ఆర్ఆర్ ఫ్రాంచైజీ, అతని కాంట్రాక్టును పొడిగించింది.

  • Loading...

More Telugu News