Jacquellin Fernandez: పవన్ సినిమాకి బాలీవుడ్ భామ ఖరారు?

Jacquelin gives nod for Pawan Kalyans film
  • పవన్ కల్యాణ్ తో క్రిష్ భారీ చిత్రం 
  • ఒక కథానాయికగా నిధి అగర్వాల్
  • మరో నాయికగా జాక్వెలిన్ ఎంపిక
  • వజ్రాల దొంగగా వెరైటీ పాత్రలో పవన్
బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టాలీవుడ్ లో ఓ భారీ ఆఫర్ ను అందుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటోంది. పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. వారిలో ఒకరిగా ఇప్పటికే నిధి అగర్వాల్ ను ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి.

మరొక కథానాయిక పాత్రకు మొదటి నుంచీ జాక్వెలిన్ ను సంప్రదిస్తున్నారు. అయితే, బాలీవుడ్ లో ఆమె బిజీగా ఉండడం వల్ల డేట్స్ సమస్య తలెత్తిందట. అయినా, దర్శకుడు క్రిష్ ఆమె కోసం తీవ్రంగా ప్రయత్నించడంతో చివరికి ఆమె డేట్స్ సర్దుబాటు చేసుకుని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. చిత్రంలో ఆమె ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కనిపిస్తుందని అంటున్నారు.

పిరీడ్ డ్రామా కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో పవన్ కల్యాణ్ వజ్రాలదొంగగా కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం కోసం 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తారు.
Jacquellin Fernandez
Pawan Kalyan
Krish

More Telugu News