Raghu Rama Krishna Raju: అమిత్ షాతో భేటీ అయిన రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju meets Amit Shah
  • ఆలయాలపై జరుగుతున్న దాడుల గురించి చెప్పాను
  • నాకు భద్రతను కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశాను
  • ఏపీకి రావాలని అమిత్ షాను కోరాను
కేంద్ర హోం మంత్రితో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై అమిత్ షాకు వివరించానని చెప్పారు. ఈ దాడులపై దర్యాప్తు చేయించాలని కోరానని తెలిపారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై చర్చించానని తెలిపారు.

తనకు వై-కేటగిరీ భద్రతను కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపానని చెప్పారు. అమరావతి సెంటిమెంటును, రాష్ట్రంలో రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులను వివరించానని తెలిపారు. ఏపీ పర్యటనకు రావాలని అమిత్ షాను కోరితే.. త్వరలోనే వస్తానని చెప్పారని అన్నారు. తన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
Raghu Rama Krishna Raju
Amit Shah
BJP

More Telugu News