Radhika: నా భార్య రాధిక అసెంబ్లీకి పోటీ చేయనుంది: తమిళ నటుడు శరత్ కుమార్

Radhika Sharath Kumar to Contest in Tamilnadu Elections
  • ఈ సంవత్సరం తమిళనాడు ఎన్నికలు
  • ప్రస్తుతం ఎస్ఎంకే మహిళా విభాగాన్ని చూస్తున్న రాధిక
  • ప్రత్యేక చిహ్నంపైనే పోటీ చేస్తామన్న శరత్ కుమార్
ఈ సంవత్సరం జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య రాధిక పోటీ చేయనుందని ఎస్ఎంకే (సమత్తువ మక్కల్ కట్చి) అధినేత శరత్ కుమార్ స్పష్టం చేశారు. హీరోయిన్ గా, టీవీ నటిగా దక్షిణాది ప్రజలకు సుపరిచితమైన రాధిక, ప్రస్తుతం ఎస్ఎంకే మహిళా విభాగం ఇన్ చార్జ్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే.

శరత్ కుమార్ పార్టీ అన్నాడీఎంకే కూటమిలో ఉంటూనే, అధిక సీట్లను డిమాండ్ చేస్తూ, ప్రత్యేక చిహ్నంపై పోటీ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఇదిలావుండగా, సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ నేతగా ఉన్న కరాటే త్యాగరాజన్, బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. రజనీకాంత్ పెట్టబోయే పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు లభిస్తాయని మద్దతుదారులు భావించినా, ఆ ఆశ అడియాస కావడంతో కమలం కండువాను కప్పుకునేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Radhika
Sharath Kumar
Tamilnadu
Elections

More Telugu News