Fire Accident: ప్రభాస్ 'ఆదిపురుష్' షూటింగ్ లో అపశ్రుతి... తొలిరోజే అగ్నిప్రమాదం

Fire accident happens at Prabhas Adipurush shooting spot
  • ముంబయిలో 'ఆదిపురుష్' షూటింగ్ ప్రారంభం
  • సెట్స్ పై చెలరేగిన మంటలు
  • అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
  • ఇవాళ షూటింగ్ లో పాల్గొనని ప్రభాస్, సైఫ్ అలీఖాన్
టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్' ఇవాళ సెట్స్ పైకి వెళ్లగా, తొలిరోజే అపశ్రుతి చోటుచేసుకుంది. ముంబయిలోని గోరేగావ్ ఫిల్మ్ స్టూడియోలో 'ఆదిపురుష్' షూటింగ్ ప్రారంభమైంది. అయితే, షూటింగ్ స్పాట్ లో అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో గ్రీన్ స్క్రీన్ క్రోమా సెటప్ పూర్తిగా కాలిపోయినట్టు తెలిసింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటీన వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో హీరో ప్రభాస్, విలన్ సైఫ్ అలీఖాన్ సెట్స్ పై లేరు.

దర్శకుడు ఓం రౌత్ ఇతర సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా అగ్నికీలలు చెలరేగడంతో షూటింగ్ స్పాట్ లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే,  యూనిట్ సభ్యులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Fire Accident
Adipurush
Shooting
Prabhas
Saif Ali Khan
Mumbai

More Telugu News