JC Pawan Reddy: కొడాలి నాని నోటిని ఫినాయిల్ తో కడిగినా మంచి మాటలు రావు: జేసీ పవన్ రెడ్డి

Good words can not come from Kodali Nani mouth says JC Pawan Reddy
  • కొడాలి నాని నోరు తెరిస్తే బూతులే వస్తాయి
  • 28 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత, జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి మండిపడ్డారు. కొడాలి నాని నోరు తెరిస్తే బూతులే వస్తాయని అన్నారు. కొడాలి నాని నోటిని ఫినాయిల్ తో కడిగినా మంచి మాటలు రావని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతలు, కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై కూడా దాడికి పాల్పడ్డారని అన్నారు.

28 మంది వైసీపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని... మీడియా ముందుకు వచ్చి విజయసాయిరెడ్డి తూతూ మంత్రంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని విమర్శించారు. వైసీపీ వైఫల్యం వల్ల కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ఏపీలో పెట్రోల్, డీజిల్, మద్యం రేట్లు అధికంగా ఉన్నాయని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు.
JC Pawan Reddy
Telugudesam
Kodali Nani
YSRCP

More Telugu News