Surya: కొన్ని కొన్ని సన్నివేశాలలో నా‌ నటన చూసి నేనే సిగ్గుపడుతుంటాను: హీరో సూర్య‌

i dont watch my movies till those complete 100 days says surya
  • నా న‌ట‌న‌పై నేనే విశ్వాసంతో ఉండ‌లేను
  • 100 రోజులు దాటిన నా సినిమా చూస్తాను
  • నా భార్య, త‌మ్ముడు మాత్రం అలా కాదు
సూర్య న‌టించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. సుధ కొంగర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సూర్య నటనకు అంద‌రూ ఫిదా అయిపోయారు. అయితే, త‌న న‌ట‌న‌పై తనకే అంత విశ్వాసం ఉండదనీ, తాను న‌టించిన సినిమాలు 100 రోజులు దాటిన త‌ర్వాతే తాను వాటిని  చూస్తుంటాన‌ని సూర్య తాజాగా చెప్పాడు.

కొన్ని కొన్ని సన్నివేశాలలో త‌న‌ నటన చూసి తానే సిగ్గుపడుతుంటానని చెప్పుకొచ్చాడు.  త‌న‌ భార్య జ్యోతిక, సోద‌రుడు కార్తి మాత్రం వారు న‌టించిన‌ సినిమాల విషయంలో చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారని సూర్య చెప్పాడు. తాను మాత్రం అలా ఉండలేనని వివరించాడు.

తాను 20 ఏళ్లుగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ, త‌న సినిమాల విషయంలో విశ్వాసంతో ఉండ‌లేన‌ని తెలిపాడు. ఒకవేళ తాను న‌టించిన‌ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తే అది వారి పెద్ద మనసు వ‌ల్లే అని భావిస్తుంటాన‌ని చెప్పాడు.  
Surya
Tollywood
Kollywood

More Telugu News