Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడుల గురించి చర్చించాలంటూ పార్లమెంట్ లో జీవీఎల్ నోటీసు!

GVL Notice today to Discus Temples in AP
  • ఇటీవలి కాలంలో ఆలయాలపై దాడులు
  • జీరో అవర్ లో చర్చకు జీవీఎల్ నోటీసు
  • కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు దేవాలయాలపై జరిగిన దాడుల గురించి చర్చించాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఈ ఉదయం ప్రారంభమైన జీరో అవర్ లో నోటీసు ఇచ్చారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, పలు ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగిందని పేర్కొన్న ఆయన, దీనిపై సభలో చర్చకు అనుమతించాలని, ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని సత్వరం గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థం, తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది తదితర ప్రాంతాల్లో దుర్ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News