Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అరెస్ట్

AP TDP Atchannaidu Arrest
  • వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు ఆరోపణలు
  • అరెస్ట్ చేసి కోటబొమ్మాళికి తరలింపు
  • నిమ్మాడలో ఉద్రిక్తత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు నిమ్మాడలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తిని అచ్చెన్నాయుడు బెదిరించారంటూ నిన్న శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు నిమ్మాడలో ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలోని వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
Andhra Pradesh
TDP
Atchannaidu

More Telugu News