జైలులో శివా, శివా అంటూ రాత్రంతా పద్మజ కేకలు.. హడలిపోయిన ఖైదీలు!
- శివుడినే లోపల వేస్తారా? అంటూ అరుపులు
- ఆమె కేకలతో తోటి ఖైదీలకు నిద్ర కరవు
- విశాఖపట్టణం తరలింపు ఆలస్యం
కుమార్తెల హత్య కేసులో పద్మజ, పురుషోత్తమ నాయుడు ఇద్దరూ సబ్ జైలులోనే ఉన్నారు. వారి మానసిక పరిస్థితి బాగాలేదని వైద్యులు ఇప్పటికే నిర్ధారించారు. దీంతో వీరిని విశాఖపట్టణం మానసిక వైద్యశాలకు తరలించాలని నిర్ణయించారు. అక్కడికి తరలించేందుకు తమకు ఎస్కార్ట్ కావాలంటూ జైలు అధికారులు పోలీసులకు లేఖ రాశారు.
అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పద్మజ, పురుషోత్తమ నాయుడుల తరలింపు ఆలస్యమవుతోంది. మరోవైపు, జైలులో ఉన్న పురుషోత్తమ నాయుడు కుమార్తెలను తలచుకుని కన్నీరుమున్నీరు అవుతున్నట్టు జైలు అధికారులు తెలిపారు.