రకుల్ చేతిలో మరో హిందీ సినిమా
- తెలుగులో గ్లామర్ పాత్రలతో అగ్రస్థానం
- బాలీవుడ్ లో చేస్తున్న వరుస సినిమాలు
- ప్రస్తుతం 'మేడే', 'థ్యాంక్ గాడ్' సినిమాలు
- 'డాక్టర్ జి'లో ఆయుష్మాన్ ఖురానాతో జోడీ
మరోపక్క అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటిస్తున్న 'థ్యాంక్ గాడ్' సినిమాలోనూ నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో హిందీ చిత్రానికి సంతకం చేసింది. ఆయుష్మాన్ ఖురానా సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ ను కొట్టేసింది. ఈ చిత్రం పేరు 'డాక్టర్ జి'. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ జంగిల్ పిక్చర్స్ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, తమ బృందంలోకి రకుల్ ని ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది.
అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె డాక్టర్ పాత్రను పోషిస్తోంది. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా ఇది తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉందనీ, సినిమా ఎప్పుడు మొదలవుతుందా అన్న ఆత్రుతతో వున్నాననీ రకుల్ ట్వీట్ చేసింది. మొత్తానికి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ, ఈ చిన్నది దూసుకుపోతోందని చెప్పాలి!