Arvind: సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను కట్టడి చేయాలి: బీజేపీ ఎంపీ అరవింద్

Arvind and Soyam Baburao fires in TRS leaders
  • కేసీఆర్ పై బీజేపీ ఎంపీల ధ్వజం
  • తమ ఆఫీసులు, నివాసాలపై దాడులు పెరుగుతాయన్న అరవింద్
  • దాడులు వెంటనే ఆపాలని డిమాండ్
  • కేసీఆర్ డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయన్న సోయం బాపురావు
తెలంగాణలో బీజేపీ కార్యాలయాలు, బీజేపీ నేతల నివాసాలపై దాడులు పెరుగుతున్నాయని ఎంపీ అరవింద్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతో జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని అన్నారు. తాము రామమందిరం నిధుల సేకరణలో పాలు పంచుకుంటున్నామని, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం కాదని అరవింద్ స్పష్టం చేశారు.

మరో ఎంపీ సోయం బాపురావు కూడా టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను భయపెట్టేలా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో ఓ పథకం ప్రకారం బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. తండ్రి (కేసీఆర్) ఢిల్లీలో పొర్లుదండాలు పెడుతుంటే, కొడుకు (కేటీఆర్) మరో విధంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు చేసే దాడులను శాంతియుతంగా భరించాలని సోయం బాపురావు బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Arvind
Soyam Baburao
TRS
BJP
Telangana

More Telugu News