Hema Malini: ప్రభాస్ తల్లి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి!

Hema Malini to play mother to Prabhas
  • ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' 
  • రామాయణం ఆధారంగా సినిమా
  • రాముడిగా ప్రభాస్.. లంకేశ్ గా సైఫ్
  • కౌసల్య పాత్రలో హేమమాలిని  
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న డైరెక్ట్ హిందీ చిత్రం 'ఆదిపురుష్' అనేక ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పురాణగాథ రామాయణం ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడి పాత్రను పోషిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా విలన్ పాత్రను పోషిస్తున్నాడు.

ఇక ఇందులో శ్రీరాముడి తల్లి కౌసల్య పాత్రకు గాను ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలినిని తాజాగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల చిత్ర బృందం ఆమెను సంప్రదించగా.. ఈ పాత్ర చేయడానికి ఆమె వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. కాగా, మరో ముఖ్య పాత్ర అయిన సీత పాత్రకు కృతి సనన్ ను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నప్పటికీ, ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.

ఈ చిత్రంలో ఎస్ఎఫ్ఎక్స్ పనులకు బాగా ప్రాధాన్యం ఉందట. దాంతో హాలీవుడ్ సాంకేతిక నిపుణులను కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నిర్మాణ పనులు ముంబైలో మొదలయ్యాయి.  
Hema Malini
Prabhas
Saif Ali Khan
Om Rawath

More Telugu News