మహేశ్ సినిమాలో 'బిగ్ బాస్' భామ స్టెప్పులు?

Monal to shak a leg in Mahesh film
  • 'బిగ్ బాస్' షోతో మళ్లీ వెలుగులోకి మోనాల్ 
  • 'అల్లుడు అదుర్స్'లో ఐటం పాటలో డ్యాన్స్ 
  • 'సర్కారు వారి పాట'లో స్పెషల్ సాంగ్
  • దుబాయ్ లో జరుగుతున్న షూటింగ్   
కొన్నాళ్ల క్రితం కొన్ని తెలుగు సినిమాలలో కథానాయికగా నటించిన మోనాల్ గజ్జర్ ఆ తర్వాత ఇక్కడ అదృశ్యమైంది. గుజరాతీ, మరాఠీ సినిమాలలో పలు అవకాశాలు రావడంతో అక్కడే దృష్టి పెట్టింది. అయితే, ఇటీవల ఉన్నట్టుండి 'బిగ్ బాస్' రియాలిటీ షోలో ఒక్కసారిగా మెరవడంతో మళ్లీ అందరి దృష్టీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మపై పడుతోంది.

ఆ షోతో వచ్చిన క్రేజ్ తో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఓ ఐటం పాటను చేసింది. ఇప్పుడు ఏకంగా మహేశ్ బాబు సినిమాలోనే ఒక పాటను చేసే అవకాశాన్ని ఈ చిన్నది అందుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా 'సర్కారు వారి పాట' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ వుంది. ఇందులో ఫలానా హీరోయిన్ నటిస్తుందంటూ ఇప్పటి వరకు కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మోనాల్ పేరు వినిపిస్తోంది. ఈ ప్రత్యేక గీతానికి మోనాల్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి, ఇందులో వాస్తవమెంతన్నది చిత్ర బృందం వెల్లడించాలి.

ఇదిలావుంచితే, 'సర్కారు వారి పాట' చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా దుబాయ్ లో జరుగుతోంది. హీరో హీరోయిన్లు మహేశ్, కీర్తి సురేశ్ లతో పాటు కొందరు ఇతర తారాగణం కూడా షూటింగులో పాల్గొంటున్నారు.
Go Back to Shorts
Monal Gajjar
Mahesh Babu
Keerti Suresh
Parashuram

More Telugu News