Nirmala Sitharaman: 100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తాం: నిర్మలా సీతారామన్

Will give Covid vaccine to 100 countries says Nirmala
  • విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ తయారు చేయడం జరిగింది
  • రూ. 64,180 కోట్లతో ఆరోగ్య రంగంలో ప్రత్యేక నిధి ఏర్పాటు
  • లాక్ డౌన్ విధంచకపొతే భారీ నష్టం వాటిల్లేది
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2021-22 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎప్పుడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ ను తయారు చేయడం జరిగిందని చెప్పారు. లాక్ డౌన్ పెట్టకపోయి ఉంటే మన దేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదని అన్నారు. అన్ని రంగాల సిబ్బంది కరోనా సంక్షోభ సమయంలో అద్భుతంగా పని చేశారని కితాబునిచ్చారు.

ఆరోగ్య రంగంలో రూ. 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మల తెలిపారు. దీనికి పీఎం ఆత్మ నిర్భర్ భారత్ ఆరోగ్య పథకంగా పేరు పెట్టినట్టు చెప్పారు. కొత్తగా 9 బీఎస్ఎల్-3 స్థాయి ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 15 అత్యవసర కేంద్రాలను ఏర్పాటు  చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ కోసం రూ. 35 వేల కోట్లను కేటాయిస్తున్నామని తెలిపారు. మరో 100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను అందిస్తామని చెప్పారు. దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Nirmala Sitharaman
Union Budget 20021-22

More Telugu News