Andhra Pradesh: ఏపీ ‘పంచాయతీ ఫైట్’.. తొలి దశలో భారీగా దాఖలైన నామినేన్లు

22191 nominations filed for sarpanch post in Andhrapradesh
  • తొలి దశ నామినేషన్లకు నిన్నటితో ముగిసిన గడువు
  • మూడు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 22,191 నామినేషన్లు దాఖలు
  • రాత్రి 11.30 గంటలు దాటినా కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ
చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది. తొలి దశలో రాష్ట్రంలో 12 జిల్లాల పరిధిలో 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగనుండగా తుది గడువు అయిన నిన్న నామినేషన్లు పోటెత్తాయి. రాత్రి 11.30 గంటలు దాటినా నామినేషన్ల ప్రక్రియ కొనసాగడం గమనార్హం. మొత్తంగా మూడు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 22,191, వార్డు సభ్యుల స్థానాలకు 77,129 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ వేసేందుకు నిర్ణీత సమయానికి వచ్చిన వారందరికీ టోకెన్లు ఇచ్చారు. దీంతో రాత్రి 11.30 గంటలు దాటినా చాలా ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.
Andhra Pradesh
Panchayat Polls
Nominations

More Telugu News