ఏపీలో కొత్తగా 116 కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 41,910 కరోనా టెస్టులు
  • అత్యధికంగా కృష్ణా జిల్లాలో 24 కేసులు
  • విజయనగరంలో కొత్త కేసులు నిల్
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,278
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 41,910 కరోనా పరీక్షలు నిర్వహించగా 116 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 24 కొత్త కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 13, విశాఖ జిల్లాలో 13, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రకాశం జిల్లాలో 1, అనంతపురం జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 5 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 127 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 8,87,836 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,79,405 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,278 మంది చికిత్స పొందుతున్నారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,153గా నమోదైంది.


More Telugu News

Andhra Pradesh Corona Virus Update Positive Cases Active Cases