Naxals: చత్తీస్‌గఢ్‌లో సత్ఫలితాలిస్తున్న ‘లోన్ వర్రాటు’

  • నిన్న 16 మంది నక్సలైట్ల లొంగుబాటు
  • మొత్తంగా 288 మంది జనజీవన స్రవంతిలోకి
  • లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణ సాయం కింద రూ. 10 వేలు
16 Naxals surrender in Chhattisgarhs Dantewada district

నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘లోన్ వర్రాటు’ అనే పునరావాస కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. దంతెవాడ జిల్లాలో నిన్న 16 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో ఇద్దరిపై లక్ష రూపాయల చొప్పున రివార్డులు కూడా ఉన్నాయి. గతేడాది ప్రారంభించిన ‘లోన్ వర్రాటు’ కార్యక్రమంలో భాగంగా  ఇప్పటివరకు 288 మంది నక్సలైట్లు లొంగిపోయినట్టు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.

లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణ సాయంగా 10 వేల రూపాయలు అందించినట్టు చెప్పారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ఇతర సౌకర్యాలను వారికి కల్పిస్తామన్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు ఎస్పీ తెలిపారు.

More Telugu News