ఇందిర పాత్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్!

Kangana to play Indira Gandhi character
బాలీవుడ్ లో అటు ఆర్టిస్టుగానూ..  ఇటు వ్యక్తిగతంగానూ కూడా కంగన రనౌత్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చుకుంది. తాను ఎంచుకునే పాత్రలు వైవిధ్యంతో కూడి ఫెరోషిషియస్ గా ఉంటాయి. ఇప్పటికే పలు కథానాయిక ప్రధాన చిత్రాలను పోషించి తనదైన ముద్ర వేసింది. ఇటీవలే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితకథతో సాగే 'తలైవి' సినిమాలో కూడా నటించింది. ఈ క్రమంలో  ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో రాజకీయ పాత్రను పోషించడానికి ఓకే చెప్పింది. అది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర కావడం పెద్ద విశేషం!

దీని గురించి కంగన చెబుతూ, "ఇదొక దిగ్గజ రాజకీయ నాయకురాలి పాత్ర. ఓ పుస్తకం ఆధారంగా ఇది తెరకెక్కుతుంది. అప్పటి ఎమర్జన్సీ పరిస్థితులు.. ఆపరేషన్ బ్లూ స్టార్ .. వంటి అంశాలన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమాలో లాల్ బహదూర్ శాస్త్రి, సంజయ్ గాంధీల పాత్రలు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పని చివరి దశలో వుంది. ఈ పాత్ర పోషణ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.

అయితే, ఇందిర పాత్రను పోషిస్తున్నట్టు మాత్రం నేరుగా చెప్పలేదు. గతంలో కంగన నటించిన 'రివాల్వర్ రాణి' చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి కబీర్ దీనికి దర్శకత్వం వహిస్తాడు.  

Go Back to Shorts
Kangana Ranaut
Indira Gandhi
Sanjay Gandhi

More Telugu News