Chandrababu: మల్లెల లింగారెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా: చంద్రబాబు

Chandrababu condemns Mallela Linga Reddy arrest in Proddutur
  • ప్రొద్దుటూరు మార్కెట్ కూల్చివేత అంశంపై చంద్రబాబు స్పందన
  • వ్యాపారులు వద్దన్నా కూల్చివేశారని ఆరోపణ
  • కూల్చేసే హక్కు వైసీపీకి ఎక్కడిదంటూ ఆగ్రహం
  • తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండ్
ప్రొద్దుటూరు మార్కెట్ కూల్చివేత అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాపారులు వద్దని బతిమాలినా వినకుండా, ముస్లింలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు నడుపుకునే షాపులను కూల్చడాన్ని నిరసిస్తున్నానని తెలిపారు. నిర్మించడం చేతకాని వైసీపీకి కూల్చేసే హక్కు ఎక్కడిదని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రజావేదికతో ప్రారంభమైన కూల్చివేతల విధ్వంసకాండ ప్రతి నియోజకవర్గంలో కొనసాగుతూనే ఉందని తెలిపారు. చిరువ్యాపారుల పొట్టకొట్టే ప్రొద్దుటూరు మార్కెట్ కూల్చివేతను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన మల్లెల లింగారెడ్డి సహా, టీడీపీ, ఇతర విపక్షాల నేతలపై బనాయించిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని స్పష్టం చేశారు.
Chandrababu
Mallela Lingareddy
Proddutur
Market
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News