USA: యూఎస్ లో నమోదైన సౌతాఫ్రికా కరోనా స్ట్రెయిన్ తొలి కేసులు!

  • సౌత్ కరోలినాలో రెండు కేసులు
  • పౌరులంతా జాగ్రత్తగా ఉండాలి
  • అరికట్టే చర్యలు తీసుకోకుంటే పెను ఇబ్బందులు
  • హెచ్చరించిన ప్రజారోగ్య విభాగం
South Africa Corona Strain Cases in USA

సాధారణ కరోనా వైరస్, యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనాతో పోలిస్తే, మరింత వేగంగా వ్యాపిస్తున్న దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్ అమెరికాకు వ్యాపించింది. ఎక్కడికీ ప్రయాణాలు చేయని ఇద్దరిలో ఈ కొత్త వైరస్ బయట పడిందని గురువారం నాడు వైద్యాధికారులు వెల్లడించారు.

ఈ రెండు కేసులూ సౌత్ కరోలినాలోనే వెలుగులోకి రావడం గమనార్హం. సార్స్ - కోవ్-2 పేరిట ఉన్న ఈ వైరస్ పౌరులందరికీ ఓ హెచ్చరిక వంటిదని, దీన్ని తక్షణం అరికట్టేందుకు చర్యలు తీసుకోకుంటే, తక్కువ సమయంలోనే పెను ఇబ్బందులు తప్పవని సౌత్ రోలినా రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ బ్రాన్న్ ట్రాక్స్ లర్ హెచ్చరించారు.

కొత్త స్ట్రెయిన్ పై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారని వెల్లడించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, పౌరులు జాగ్రత్తగా ఉండాలని, కరోనా నియమాలను పాటించాలని కోరింది. కాగా, బ్రిటన్ స్ట్రెయిన్ కన్నా, దీని ప్రభావం అధికమని ఆందోళన వ్యక్తం చేసిన సీడీసీ, మిన్నెసోటాలో, బ్రెజిల్ లో వచ్చిన కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం యూఎస్ లో కొత్త కేసులే ఎక్కువ వస్తుండటం ఆందోళనకరమని సీడీసీ పేర్కొంది.

More Telugu News