Harish Rao: కిక్ కొట్టి ఫుట్ బాల్ పోటీలు ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

Harish Rao inaugurates CM KCR Cup Football tourney in Gajwel
  • గజ్వేల్ లో రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలు
  • 'సీఎం కేసీఆర్ కప్' టోర్నీని షురూ చేసిన హరీశ్
  • గజ్వేల్ అన్నింటా ఆదర్శప్రాయంగా నిలిచిందని వెల్లడి
  • క్రీడలకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారన్న మంత్రి 
గజ్వేల్ లో రాష్ట్ర స్థాయి సీఎం కేసీఆర్ కప్ ఫుట్ బాల్ పోటీలను మంత్రి హరీశ్ రావు ఇవాళ ప్రారంభించారు. ఆటగాళ్ల గౌరవ వందనం స్వీకరించిన హరీశ్ రావు జ్యోతిని వెలిగించారు. ఆపై బంతిని లాఘవంగా కిక్ కొట్టి పోటీలను షురూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నింటా గజ్వేల్ ఆదర్శప్రాయంగా నిలిచిందని, ఇప్పుడు తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన జట్లతో గజ్వేల్ లో ఫుట్ బాల్ టోర్నీ జరగడం గర్వకారణం అని పేర్కొన్నారు.

తెలంగాణలో గజ్వేల్ మంచి స్పోర్ట్స్ హబ్ కావాలని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ హబ్ కోసం డీపీఆర్ సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. క్రీడలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారని, గ్రామీణ క్రీడలకు తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.
Harish Rao
Football Tourney
CM KCR Cup
Gajwel

More Telugu News