రైతులు దాడి చేయడంతో 15 అడుగుల గోడపై నుంచి పడిపోయిన పోలీసులు.. వీడియో ఇదిగో
- నిన్న ఢిల్లీలో రైతుల ఆందోళన
- బారికేడ్లను తొలగించి వెళ్లేందుకు రైతుల యత్నం
- ఎర్రకోట సమీపంలో ఘటన
దీంతో రైతులు కర్రలతో పోలీసుల వెంట పడడంతో పోలీసులు వారి నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఇందుకు సంబంధించిన మరో వీడియో మీడియాకు చిక్కింది. ఎర్రకోట సమీపంలో బారికేడ్లను తెంచుకుని రైతులు ముందుకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఆ సమయంలో పోలీసులపై దాడికి యత్నించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులు 15 అడుగుల గోడపై నుంచి గోతిలోకి దూకారు. మరికొందరు పోలీసులు అక్కడ పట్టుకుని నిలబడేందుకు ఏమీ లేకపోవడంతో జారిపోయి 15 అడుగుల లోతులో పడిపోయారు.