ఎస్ఈసీ నిమ్మగడ్డకు గవర్నర్ అపాయింట్ మెంట్!
- ఈ ఉదయం 10 గంటల తరువాత భేటీ
- ఎన్నికల ఏర్పాట్లపై వివరించనున్న నిమ్మగడ్డ
- క్రమశిక్షణా చర్యలపైనా వివరణ
కాగా, ఈ భేటీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, ఎలక్షన్ కమిషన్ తరఫున తీసుకుంటున్న చర్యలపై ఎస్ఈసీ వివరణ ఇవ్వనున్నారు. ఆపై అధికారులపై చేపడుతున్న క్రమశిక్షణా చర్యల గురించి కూడా గవర్నర్ కు నిమ్మగడ్డ వివరిస్తారని తెలుస్తోంది.