sec: ఏపీలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌పై ఎస్ఈసీ చర్యలు

- గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
- నిబంధనల ఉల్లంఘనలను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలి
- అధికారుల నిర్లక్ష్యం వల్లే 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో పాటు ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఇద్దరు అధికారులనూ బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ఉల్లంఘనలను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించింది.
అధికారుల నిర్లక్ష్యం వల్లే 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని పేర్కొంది. ఈ కారణంగా యువ ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని తెలిపింది. ఇద్దరు అధికారులూ తమ విధుల నిర్వహణలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. టెక్నికల్, న్యాయపర చిక్కుల వల్లే 2019 ఓటర్ల జాబితాతోనే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.