జనసేనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: నాదెండ్ల
- ఎన్నికల్లో బీజేపీతో కలిసి పార్టీ పోటీ చేస్తుంది
- తిరుపతి ఉప ఎన్నికపై పూర్తి అవగాహనతో ఉన్నాం
- జనసేన పార్టీని తక్కువగా అంచనా వేయొద్దు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికపై తమ పార్టీ పోటీ చేయడంపై కూడా పూర్తి అవగాహనతో ఉందని ఆయన తెలిపారు. తమ పార్టీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వదంతులు సృష్టించడం సరికాదని అన్నారు. అలాగే, ఏపీలో బలాన్ని పుంజుకుంటోన్న జనసేన పార్టీని తక్కువగా అంచనా వేయొద్దని చెప్పారు.