RBI: రూ.100, రూ.10, రూ.5 నోట్ల రద్దు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆర్బీఐ వివరణ

RBI clarifies small currency notes future
  • చిన్న నోట్లు రద్దు చేస్తారంటూ ప్రచారం
  • మార్చి నుంచి చెల్లవని ఊహాగానాలు
  • ట్విట్టర్ లో స్పందించిన ఆర్బీఐ
  • జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టీకరణ
దేశంలో రూ.100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఎప్పటినుంచో చలామణిలో ఉన్నాయి. అయితే ఈ మూడు నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రద్దు చేస్తోందంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఆ మూడు రకాల నోట్లు చెల్లుబాటు కావని ఊహాగానాలు వ్యాప్తి చెందాయి.

 దీనిపై తాజాగా ఆర్బీఐ స్పందించింది. భవిష్యత్తులో రూ.100, రూ.10, రూ.5 నోట్లను ఉపసంహరించుకుంటున్నామని మీడియాలోని ఓ వర్గంలో జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేసింది. తమకు అలాంటి ఉద్దేశాల్లేవని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

2016లో రూ.1000, రూ.500 పాత నోట్లను రద్దు చేసిన కేంద్రం... రూ.100, రూ.10, రూ.5 నోట్ల జోలికి మాత్రం వెళ్లలేదు. అయితే, 2018లో రూ.10, రూ.50తో పాటు కొత్తగా రూ.200 నోట్లను ముద్రించిన ఆర్బీఐ... 2019లో సరికొత్త రూ.100 నోట్లను తీసుకువచ్చింది.
RBI
Currency
Wirhdraw
India

More Telugu News