Andhra Pradesh: సుప్రీంకోర్టు తీర్పుపై ఉద్యోగ సంఘాల నేతల స్పందన

AP govt employees union leaders takes U Turn after Supreme Courts verdict on panchayat elections
  • ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తొలుత ప్రకటించిన ఉద్యోగ సంఘాల నేతలు
  • ఆరోగ్యం సరిగా లేని ఉద్యోగులను మినహాయించాలన్న వెంకట్రామిరెడ్డి
  • వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలన్న చంద్రశేఖర్ రెడ్డి
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఆరోగ్యం సరిగా లేని ఉద్యోగులను మినహాయించి, మిగిలిన ఉద్యోగులతో ఎన్నికలను నిర్వహించుకోవచ్చని తాము చెప్పామని అన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతైతే ఉద్యోగులందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పారు.

మరోవైపు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుదు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. ఉద్యోగుల ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఈ కారణం వల్లే సుప్రీంకోర్టులో తాము ఇంప్లీడ్ పిటిషన్ వేశామని తెలిపారు.
Andhra Pradesh
Gram Panchayat Elections
Supreme Court
Employees Unions

More Telugu News