Jawans: మంచువానను కూడా లెక్కచేయకుండా తల్లి, శిశువును ఇంటికి చేర్చిన జవాన్లు... వీడియో ఇదిగో!

Jawans carries mother and her new born child
  • బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
  • మంచుతుపాను కారణంగా ఆసుపత్రిలోనే చిక్కుకున్న వైనం
  • భారత జవాన్ల సేవా దృక్పథం
  • తల్లిని, బిడ్డను మోసుకుంటూ ఆరు కిలోమీటర్ల పయనం
సరిహద్దుల్లో ప్రాణాలకు లెక్కచేయకుండా విధులు నిర్వర్తించే జవాన్లు తమ మంచి మనసును మరోసారి చాటుకున్నారు. జమ్మూకశ్మీర్ కుప్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతం లోలాబ్ కు చెందిన ఓ మహిళ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ ప్రాంతంలో తీవ్ర హిమపాతం నెలకొని ఉండడంతో ఆ మహిళ తన శిశువుతో పాటే ఆసుపత్రి వద్దే నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జవాన్లు ఆమెకు సాయపడాలని నిర్ణయించుకున్నారు.

ఆ బాలింతరాలిని కాలు కిందపెట్టనివ్వకుండా ఓ స్ట్రెచర్ పై మోసుకుంటూ వారు 6 కిలోమీటర్ల పాటు నడిచారు. మంచువానను కూడా లక్ష్యపెట్టకుండా ఎంతో శ్రమించి ఆమెను, ఆమె బిడ్డను ఇంటికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. జవాన్ల సేవా నిరతిని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.
Jawans
Mother
Child
Snow

More Telugu News