Pawan Kalyan: తిరుపతి ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం

Grand welcome for Pawan Kalyan in Tirupati airport
  • తిరుపతిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం
  • నాదెండ్ల మనోహర్ తో కలిసి తిరుపతి చేరుకున్న పవన్
  • భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
  • పవన్ రాకతో కార్యకర్తల్లో ఉత్సాహం
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో కాసేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తిరుపతి వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద వీరికి ఘనస్వాగతం లభించింది.

మధ్యాహ్నం సమయానికే విమానాశ్రయం వద్దకు జనసేన శ్రేణులు భారీగా చేరుకున్నాయి.  పవన్ రాకతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగింది. అభిమానులకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేసుకుంటూ పవన్ తన కాన్వాయ్ తో ముందుకు కదిలారు. కాగా, తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీతో ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అంశాన్ని పవన్ కల్యాణ్ ఇవాళ సాంత పార్టీలో చర్చించనున్నారు.
Pawan Kalyan
Tirupati
Airport
Janasena

More Telugu News