Narendra Modi: బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: భారత ప్రధాని మోదీ

we together work for reach new heights modi tweets
  • అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్‌కు మోదీ అభినందనలు
  • పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకోవాలని ఆకాంక్ష
  • ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త ఎత్తులకు చేరేలా కలిసి పనిచేస్తానన్న మోదీ
అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు, మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బైడెన్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు.

ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొని, ప్రపంచ శాంతి,  భద్రతల సాధనకు కలసికట్టుగా పనిచేద్దామన్నారు. బైడెన్ తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు సరికొత్త ఎత్తులకు చేరేలా బైడెన్‌తో కలిసి పనిచేస్తానని అన్నారు. నమ్మకం ఆధారంగా భారత్-అమెరికా భాగస్వామ్యం కొనసాగుతుందని మోదీ పేర్కొన్నారు.
Narendra Modi
Joe Biden
America
India

More Telugu News