Pedda Reddy: మరోసారి వార్తల్లోకి ఎక్కిన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి

Tadipatri MLA Peddareddy involves in new controversy
  • వ్యక్తిగత పనుల మీద ఎల్లనూరు మండలానికి వెళ్లిన పెద్దారెడ్డి
  • తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి, ఆయన ఛైర్లో కూర్చున్న వైనం
  • మేజిస్ట్రేట్ హోదా కలిగిన అధికారి సీటులో ఎలా కూర్చుంటారని విమర్శలు
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. వివరాల్లోకి వెళితే వ్యక్తిగత పనుల మీద ఎల్లనూరు మండలానికి వెళ్లిన ఆయన... అక్కడున్న తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లి, ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అంతేకాదు తహసీల్దార్ కుర్చీలో కూర్చున్నారు. విధులకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై మండిపడ్డారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

తన నియోజకవర్గం కాకపోయినా మేజిస్ట్రేట్ హోదా కలిగిన తహసీల్దార్ కుర్చీలో కూర్చోవడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు లేనప్పుడు ఇలా వచ్చి ఉద్యోగులపై చిందులేయడం సరికాదని అంటున్నారు. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన పెద్దారెడ్డి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రల్లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
Pedda Reddy
YSRCP

More Telugu News