Pawan Kalyan: వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan to meet Vengaiah Naidu family
  • 23న వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్
  • కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించనున్న జనసేనాని
  • జిల్లా ఎస్పీని  కలిసే అవకాశం
ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన వెంగయ్యనాయుడు కుటుంబాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఈ నెల 23న పరామర్శించనున్నట్టు జనసేన ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న బండ్ల వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు తెలిపింది.

ఈ నెల 22న పవన్ తిరుపతి నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు ఒంగోలు చేరుకుంటారని... 23న కుటుంబాన్ని పరామర్శిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు కూడా పాల్గొంటారని తెలిపారు. జిల్లా ఎస్పీని కలిసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరే అవకాశం కూడా ఉందని వివరించారు.

Pawan Kalyan
Janasena
Vengaiah Naidu

More Telugu News