Pawan Kalyan: బాబాయ్ కాంబినేషన్లో రామ్ చరణ్ భారీ సినిమా?

A crazy project planned with Pawan Kalyan and Ram Charan
  • టాలీవుడ్ లో భారీ కాంబోలతో క్రేజీ ప్రాజక్టులు 
  • పవన్, చరణ్ కలయికలో శంకర్ భారీ సినిమా
  • ఇప్పటికే కథ లైన్ ను సిద్ధం చేసిన దర్శకుడు  
  • 200 కోట్ల బడ్జెట్టుతో పాన్ ఇండియా సినిమా   
ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో భారీ కాంబినేషన్లతో సినిమాల నిర్మాణం జరుగుతోంది. వందలాది కోట్ల బడ్జెట్టుతో ఆయా కాంబినేషన్లతో చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇదే కోవలో ఇప్పుడు మరో భారీ కాంబినేషన్ తెరకెక్కనుందని వార్తలొస్తున్నాయి. అదే పవన్ కల్యాణ్-రామ్ చరణ్ హీరోలుగా ఓ భారీ చిత్ర నిర్మాణం!

ఇక ఈ భారీ చిత్రానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తాడట. ఇటీవల రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లను దర్శకుడు శంకర్ ఈ విషయంలో సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథ లైన్ కూడా ఓకే అయినట్టు చెబుతున్నారు. ఇందులో పవన్, చరణ్ ల పాత్రలు ఇంచుమించు సమానంగా వుంటాయని అంటున్నారు.

ఈ ప్రాజక్టు పట్ల రామ్ చరణ్ చాలా ఎగ్జయిట్ మెంటుతో ఉన్నాడనీ, పవన్ సైడు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావలసివుందనీ సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో.. అత్యున్నత సాంకేతిక విలువలతో దీనిని 200 కోట్ల బడ్జెట్టుతో ఓ ప్రముఖ నిర్మాత నిర్మించడానికి సిద్ధంగా వున్నాడట. ఈ క్రేజీ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఒకవేళ ఇదే కనుక కార్యరూపం దాల్చితే, మెగా అభిమానులకు ఇక పండగే!
Pawan Kalyan
Ramcharan
Shankar

More Telugu News