Bandi Sanjay: కేంద్రం అడిగిన డీపీఆర్ లను టీఆర్ఎస్ సర్కారు ఇప్పటివరకు ఇవ్వలేదు: బండి సంజయ్

Bandi Sanjay slams TRS government over Kaleswaram project
  • కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన కేసీఆర్
  • విమర్శనాస్త్రాలు సంధించిన బండి సంజయ్
  • కాళేశ్వరం ఓ విఫల డిజైన్ అని విమర్శలు
  • సందర్శన స్థలం అవుతుందని ఎద్దేవా
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన నేపథ్యంలో విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర జలశక్తి శాఖ అడిగిన డీపీఆర్ లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మూడో టీఎంసీ డీపీఆర్ ఇస్తే సర్కారు బండారం బట్టబయలవుతుందని పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఇచ్చిన డీపీఆర్ లో 17.50 లక్షల ఎకరాలను చూపించిన టీఆర్ఎస్ సర్కారు కోటి ఎకరాలకు నీరు అందిస్తున్నట్టు చెబుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నమూనా ఓ విఫల డిజైన్ అని, ప్రజలకు దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు. రాబోయే కాలంలో అది ప్రజలకు సందర్శన స్థలం అవుతుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
Bandi Sanjay
KCR
TRS
Kaleswaram Project
Telangana

More Telugu News