Jagan: ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్... అమిత్ షాతో భేటీ!

CM Jagan arrives Dellhi to meet Amit Shah
  • ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం
  • సీఎం వెంట పలువురు ఎంపీలు
  • రాష్ట్రాభివృద్ధి అంశాలపై అమిత్ షాతో చర్చ
  • సీఎం పర్యటన వెనుక రాజకీయ ఉద్దేశాల్లేవన్న సజ్జల
ఏపీ సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. కాసేపట్లో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రాభివృద్ధికి చెందిన అంశాలపై అమిత్ షాతో చర్చించనున్నారు.

మరోపక్క, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం ఢిల్లీ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర అంశాల గురించి అమిత్ షాను కలవనున్నారని వెల్లడించారు. హైకోర్టు విభజన అంశాన్ని కూడా సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా సజ్జల ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపైనా స్పందించారు. ఈ వ్యవహారంలో కిలారి రాజేశ్ కేసు ఓ చిన్న విషయం మాత్రమేనని, ఇందులో ఉన్న పెద్ద తలకాయలు త్వరలోనే బయటికొస్తాయని వ్యాఖ్యానించారు.
Jagan
New Delhi
Amit Shah
YSRCP
Andhra Pradesh

More Telugu News