Samantha: భర్త ఫొటోపై సమంత చిలిపి కామెంట్... నెట్టింట వైరల్!

Samantha Comment on Chaitu Goes Viral
  • విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో 'థ్యాంక్యూ' 
  • సెట్స్ పై చైతూ ఫొటో తీసిన పీసీ శ్రీరామ్
  • అరే... నా గురించే ఆలోచిస్తున్నావా? అని అడిగిన సమంత
టాలీవుడ్ బెస్ట్ క్యూట్ కపుల్ ఎవరంటే, నాగ చైతన్య, సమంతల పేర్లే తొలుత వినిపిస్తాయి. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకునే సమంత, తాజాగా, తన భర్త చైతూ ఫొటోపై చేసిన చిలిపి కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది.  

ప్రస్తుతం నాగ చైతన్య, విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో 'థ్యాంక్యూ' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చైతూని తన కెమెరాలో బంధించాడు. చీకట్లో ఓ బెంచ్ పై కూర్చున్న నాగ చైతన్య, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుగా ఈ పిక్ కనిపిస్తోంది.

దీన్ని తొలుత చైతూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, దీన్ని పీసీ శ్రీరామ్ తీశారని, అటువంటి వ్యక్తితో పనిచేసే అవకాశం తనకు లభించడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నాడు. ఈ పిక్ కు నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్న వేళ సమంత కూడా స్పందించింది. "అరే... నా గురించే ఆలోచిస్తున్నావా?" అంటూ చిలిపిగా కామెంట్ చేసింది. సమంత కామెంట్ తరువాత ఈ పిక్ మరింతగా వైరల్ అయింది.
Samantha
Naga Chaitanya
Comment
Viral

More Telugu News