Nara Lokesh: 60 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించారు: నారా లోకేశ్

Nara Lokesh praises NTR
  • రైతు బిడ్డగా పుట్టి దేవుడై వెలిగారు
  • సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించారు
  • ఎన్టీఆర్ కీర్తిశేషులై 25 ఏళ్లు అయ్యాయంటే నమ్మశక్యంగా లేదు
తన తాత దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 60 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలను సాధించారని చెప్పారు. సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించారని అన్నారు. సామాన్య రైతు బిడ్డగా పుట్టి వెండితెర దేవుడై వెలిగారని... ఒక మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలంటే పట్టుదల, కృషి ఉంటే చాలని నిరూపించారని చెప్పారు.

సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించి, ఏదైనా సాధించడానికి వయసుతో పని లేదని నిరూపించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు పాలనాధికారాలు అప్పచెప్పినా, మహిళలకు ఆస్తి హక్కు కల్పించినా, పేదలకు వినూత్న పథకాలను అందించినా అది ఎన్టీఆర్ ఘనతేనని చెప్పారు. ఎన్టీఆర్ కీర్తిశేషులై 25 ఏళ్లు అయ్యాయంటే నమ్మశక్యంగా లేదని అన్నారు. గొప్ప మానవతావాది అయిన ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితమవుదామని చెప్పారు.
Nara Lokesh
NTR
Telugudesam

More Telugu News