BS Chandrasekhar: మ్యాచ్ చూస్తుండగా అస్వస్థత.. ఐసీయూలో టీమిండియా మాజీ స్పిన్నర్ బీఎస్ చంద్రశేఖర్

Former India Cricketer BS Chandrasekhar Admitted In ICU
  • టీవీలో మ్యాచ్ వీక్షిస్తుండగా అస్వస్థత
  • ఆయాసం, తడబడిన మాట
  • మరో రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారన్న భార్య
టీమిండియా మాజీ స్పిన్నర్ బీఎస్ చంద్రశేఖర్ (75) గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెప్పారు. టీవీలో మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో చంద్రశేఖర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారని, విపరీతంగా ఆయాసపడిపోయారని, మాట కూడా తడబడిందని ఆయన భార్య సంధ్య చంద్రశేఖర్ తెలిపారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని తెలిపారు.
BS Chandrasekhar
Team India
Cricketer
ICU
Hospital

More Telugu News