Tandav: ‘తాండవ్’పై నిరసన సెగ.. సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం

 Police seen stationed outside Saif Ali Khans home amid Tandav row
  • తాండవ్ వెబ్ సిరీస్‌లో దేవుళ్లను అవమానించారని ఆరోపణలు
  • మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందన్న బీజేపీ నేతలు
  • బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతున్న నిరసనలు
  • జవదేకర్‌కు లేఖ రాసిన బీజేపీ ఎంపీ మనోజ్ కుమార్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సైఫ్ తాజా వెబ్ సిరీస్ ‘తాండవ్’లో దేవుళ్లను అవమానించారని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఆ సిరీస్ ఉందంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దానిని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ‘బాయ్‌కాట్ తాండవ్’, ‘బ్యాన్ తాండవ్’ హ్యాష్‌ట్యాగ్‌లతో వైరల్ చేస్తున్నారు.

తాండవ్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే రామ్‌కదమ్ ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు బీజేపీ ఎంపీ మనోజ్ కుమార్ కొటక్ లేఖ రాశారు. ఈ సిరీస్‌లో దేవుళ్లను ఎగతాళి చేయడం, సెక్స్, హింస, మాదక ద్రవ్యాల వాడకంతోపాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని మనోజ్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. వెబ్‌సిరీస్‌పై ఆందోళనలు పెరుగుతుండడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Tandav
Saif Ali Khan
Bollywood
Web Series

More Telugu News