Saipallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Sai Pallavi has been roped to play female lead in Teja film
  • గోపీచంద్ సినిమాలో సాయిపల్లవి?
  • మళ్లీ ఫారెస్ట్ లో 'పుష్ప' షూటింగ్
  • 29న 'ఆహా'లో 'క్రాక్' ప్రీమియర్
*  ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'అలిమేలుమంగ వెంకటరమణ' పేరిట ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయిక పాత్రకు పలువురిని పరిశీలించిన మీదట చివరికి సాయిపల్లవిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమా షూటింగ్ మళ్లీ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో గత వారం రోజులుగా జరుగుతోంది. వచ్చే నెల వరకు ఇక్కడే షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్, ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తోంది.
*  ఇటీవల రిలీజైన రవితేజ సినిమా 'క్రాక్' మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం డిజిటల్ హక్కులను తీసుకున్న 'ఆహా' ఓటీటీ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 29న స్ట్రీమింగ్ చేయడానికి నిర్ణయించింది.
Saipallavi
Teja
Allu Arjun
Rashmika Mandanna
Raviteja

More Telugu News