Mohan Babu: మోహన్ బాబు కొత్త సినిమాలు ఇవేనంటూ ప్రచారం... స్పందించిన పీఆర్ఓ

PRO reacts on rumors about Mohanbabu future projects
  • ఇటీవల ఆచార్య సెట్స్ పై మోహన్ బాబు
  • చిరు చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారంటూ ప్రచారం
  • ఆ ప్రచారంలో నిజంలేదన్న మోహన్ బాబు పీఆర్ఓ
  • ఏదైనా ఉంటే తాము అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడి
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. అయితే, ఇటీవల ఆయన చిరంజీవి 'ఆచార్య' సెట్స్ పై కనిపించడంతో అందులో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారంటూ టాక్ వినిపించింది. ఆయన మరికొన్ని ఇతర సినిమాలను కూడా అంగీకరించారంటూ ప్రచారం జరుగుతోంది.

దీనిపై మోహన్ బాబు పీఆర్ఓ స్పందించారు. మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం తప్ప మరే చిత్రాన్ని అంగీకరించలేదని, ఆయన ప్రస్తుతం 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రంలోనే నటిస్తున్నారని స్పష్టం చేశారు. మోహన్ బాబు కొత్త సినిమాలు ఇవేనంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ఆయన కొత్త సినిమాలు అంగీకరిస్తే ఆ విషయాన్ని తాము అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.
Mohan Babu
Upcoming Cinemas
PRO
Rumors
Tollywood

More Telugu News