Ram: టాలీవుడ్ లో నాకు పోటీ ఎవరో ఇప్పటికి తెలిసింది: హీరో రామ్ ఆసక్తికర వ్యాఖ్య!

Now I Know Who is the Competition for me says Hero Ram
  • ఫ్యాన్సే నాకు పోటీ
  • వారి అభిమానానికి నా నటనే సమాధానం
  • అభిమానులను మరింతగా అలరిస్తానన్న రామ్
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసిందని, వారితో పోటీ పడటమే తన లక్ష్యమని హీరో రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీలో వచ్చిన 'తడమ్'కు రీమేక్ గా తాను నటించిన 'రెడ్' సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతుండగా, తాజాగా విశాఖలో జరిగిన సక్సెస్ మీట్ లో రామ్ మాట్లాడాడు. "ఈ సినిమా ముందు వరకూ ఒక లెక్క. ఇకపై ఒక లెక్క. అభిమానులే నాకు అసలైన పోటీ. అందరమూ ఎంతో కష్టపడి సినిమా చేశాం. సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమాను చేశాం. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనన్న భయం, టెన్షన్ ఇప్పుడు పోయింది.

సినిమాలో ఉన్న ట్విస్టుల కన్నా, విడుదల తరువాత వచ్చిన ట్విస్టులు పెరిగిపోయాయి. భారీ కలెక్షన్లను అభిమానులు కురిపించారు. ఈ విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం సంక్రాంతి సందర్భంగానే నేను 'దేవదాసు'తో ఇండస్ట్రీలోకి వచ్చాను. నాకు పోటీ ఎవరని చాలా మంది అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్పగలను. ఫ్యాన్సే నాకు నిజమైన పోటీ. వారు చూపించే ప్రేమ కన్నా, నా నటనతో వారిని అలరించడంలో నేనే ముందుంటానని చూపడమే నా టార్గెట్" అని రామ్ వ్యాఖ్యానించాడు.

Ram
RED
Hero
Fans

More Telugu News