Vidyasagar Rao: బీజేపీ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది: విద్యాసాగర్ రావు

Vidyasagar Rao says Telangana establishes with the help of BJP
  • అనంతగిరి క్షేత్రాన్ని దర్శించిన బీజేపీ నేత విద్యాసాగర్ రావు
  • తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా
  • బండి సంజయ్ పనితీరుపై కితాబు
  • అనుకున్నదానికంటే ఎక్కువ కృషి చేస్తున్నాడని వ్యాఖ్య  
బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఇవాళ వికారాబాద్ జిల్లా అనంతగిరిలో  శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతోందని, బండి సంజయ్ ఊహించిన దానికంటే ఎక్కువగా శ్రమిస్తున్నారని కొనియాడారు. బీజేపీ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు.

తమకు ఇప్పుడు తెలంగాణలో రెండు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయని, జాతీయస్థాయిలోనూ అట్టడుగు స్థాయి నుంచి అధికారంలోకి వచ్చిన ఘనత బీజేపీ సొంతమని అన్నారు. మరణానంతరం తన దేహంపై పార్టీ జెండా కప్పాలనేది ప్రతి బీజేపీ కార్యకర్త అభిమతం అని, అందుకే తాను తిరిగి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించానని కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు వెల్లడించారు.
Vidyasagar Rao
Telangana
BJP
Bandi Sanjay

More Telugu News