Varla Ramaiah: ఈ ఏడాది దేవాలయాల మీద దాడులే మీ గోపూజకు కారణమా?: వర్ల రామయ్య

Varla Ramaiah comments on CM Jagan who offered prayers to Cow
  • నరసరావుపేటలో గోపూజ
  • పాల్గొన్న సీఎం జగన్
  • ఆనందం కలిగించారన్న వర్ల రామయ్య
  • గత సంక్రాంతికి ఇలా ఎందుకు చేయలేదంటూ ట్వీట్
  • పీకే దయ, మా ప్రాప్తం! అంటూ వ్యంగ్యం
గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో కనుమ పండుగ సందర్భంగా నిర్వహించిన గోపూజ మహోత్సవంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గోపూజ ఆచరించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు.

 సీఎం గారూ... సంక్రాంతికి గోపూజ చేసి రాష్ట్రంలోని హైందవ భక్తులకు సంతోషం కలిగించారు అంటూ ట్వీట్ చేశారు. సీఎం చర్య ఆనందదాయకం అని పేర్కొన్నారు. "మరి, గత సంక్రాంతికి మీరు ఇంటికే పరిమితం అయ్యారు. గోపూజ చేయలేదు... ఎందుకని?" అని ప్రశ్నించారు. "ఈ ఏడాది దేవాలయాల మీద దాడులే మీ గోపూజకు కారణమా? లేక, ఇకపై ప్రతి ఏడాది చేస్తారా? పీకే దయ, మా ప్రాప్తం" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
Varla Ramaiah
Jagan
Cow Worship
Narasaraopet
YSRCP
Andhra Pradesh

More Telugu News