Rohit Sharma: బిగ్‌బాస్‌ విన్నర్‌ అభిజిత్‌కు గిఫ్ట్‌ పంపిన రోహిత్ శర్మ

Rohit Sharma sends gift to Big Boss winner Abijeet
  • బిగ్ బాస్ గురించి రోహిత్ కు చెప్పిన హనుమ విహారి
  • తన జెర్సీని అభిజిత్ కు పంపిన రోహిత్
  • రోహిత్ అంటే తనకు ఎంతో అభిమానమన్న అభిజిత్
బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కు టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ సర్ ప్రైజ్ ఇచ్చాడు. బిగ్ బాస్ లో గెలిచినందుకు రోహిత్ స్వయంగా ఫోన్ చేసి అభినందించాడు. అంతేకాదు, తన జెర్సీపై 'విత్ లవ్ అండ్ బెస్ట్ విషెస్' అని రాసి తన సంతకం చేసి అభిజిత్ కు పంపించాడు. ఈ సందర్భంగా హనుమ విహారికి కూడా అభిజిత్ థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాదు తీవ్ర ఒత్తిడిలో కూడా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నావని కితాబిచ్చాడు.

తాను ఎంతగానో అభిమానించే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుంటే... అన్ని పనులను ఆపేసి క్రికెట్ చూస్తూ ఉండిపోతానని అభిజిత్ చెప్పాడు. క్రికెటర్ కావాలనేది చిన్నప్పటి నుంచి తన కోరిక అని తెలిపాడు. అయితే, అది జరగలేదని... జీవితం మరో కోణంలో పయనించిందని చెప్పాడు. ఇప్పటికీ క్రికెట్ అనేది తనలోని చిన్న పిల్లాడిని బయటకు తీసుకొస్తుందని తెలిపాడు.

రోహిత్ శర్మ మహారాష్ట్ర నుంచి వచ్చినప్పటికీ... అతని మూలాలు తెలుగుగడ్డపై ఉన్నాయి. రోహిత్ అమ్మ తెలుగువారే కావడం గమనార్హం. అంతేకాదు రోహిత్ శర్మ చాలా స్పష్టమైన తెలుగు మాట్లాడతాడు. మరోవైపు, తెలుగు తేజం హనుమ విహారి టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, రోహిత్, విహారి మధ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చ వచ్చింది. ఈ క్రమంలో బిగ్ బాస్ గురించి కూడా చర్చించుకున్నారు. దీంతో, బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు రోహిత్ బహుమతి అందించాడు. ఈ విషయాన్ని అభిజిత్ స్వయంగా వెల్లడించాడు. తాను ఎంతో అభిమానించే క్రికెటర్ నుంచి తనకు గిఫ్ట్ అందిందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
Rohit Sharma
Abijeet
Bigg Boss Telugu 4
Tollywood
Team India
Gift

More Telugu News