Patnam Subbaiah: ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణం

Former AP minister Patnam Subbaiah dead
  • ఐరాల మండలం కొత్తపల్లిలో నిన్న రాత్రి మృతి
  • రేపు జరగనున్న అంత్యక్రియలు
  • రెండు సార్లు మంత్రిగా చేసిన పట్నం
ఏపీ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొత్తపల్లిలో రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. రేపు ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు.

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నుంచి ఆయన మూడు సార్లు గెలిచారు. దివంగత ఎన్టీఆర్ తో పాటు, చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు. రెండు సార్లు మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. పట్నం సుబ్బయ్య మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.  
Patnam Subbaiah
Telugudesam
BJP

More Telugu News