Air India: శంషాబాద్ నుంచి నేరుగా షికాగోకు నాన్‌స్టాప్ విమానం

Non Stop Flight to Chicago from Hyderabad starts today
  • శుక్రవారం హైదరాబాద్ నుంచి, బుధవారం షికాగో నుంచి విమానం
  • ఎయిరిండియా సేవలపై ప్రయాణికుల సంతోషం
  • మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్స్‌కు ఇది తొలి అడుగన్న కేటీఆర్
హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇది శుభవార్తే. నేటి నుంచి షికాగోకు నాన్‌స్టాప్ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. నేటి మధ్యాహ్నం షికాగో నాన్‌స్టాప్ విమాన సర్వీసులను శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ప్రారంభించనున్నారు. ప్ర‌తి శుక్ర‌వారం హైద‌రాబాద్ నుంచి  ఎయిరిండియా విమానం షికాగో బ‌య‌ల్దేర‌నుంది.  షికాగో నుంచి ప్ర‌తి బుధ‌వారం హైద‌రాబాద్‌కు మ‌రో విమానం బ‌య‌ల్దేర‌నుంది.

హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రానుండడం ఇదే తొలిసారి. ఎయిరిండియా సేవలపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి షికాగోకు డైరెక్ట్ సర్వీసులు ప్రారంభం కానుండడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయ అధికారులు, ఎయిరిండియాకు అభినందనలు తెలిపారు. మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్స్‌కు ఇది తొలి అడుగని మంత్రి పేర్కొన్నారు.
Air India
Rajiv Gandhi International Airport
Hyderabad
chicago

More Telugu News