Budget Session: బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకటించిన కేంద్రం

Centre announce budget sessions schedule
  • ఈ నెల 29న కేంద్ర బడ్జెట్ సమావేశాలు
  • ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం
  • ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
  • క్వశ్చన్ అవర్ నిర్వహించే అవకాశం
  • త్వరలోనే నిర్ణయం

కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ పై లోక్ సభ సచివాలయం ఓ ప్రకటన చేసింది. ఈ నెల 29న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం, ఆ తర్వాత జాతీయ ఆర్థిక సర్వే నివేదిక విడుదల కార్యక్రమాలు ఉంటాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. అనంతరం ఫిబ్రవరి 15 నుంచి పార్లమెంటుకు విరామం ప్రకటించారు. మళ్లీ మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్ 8తో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.

కరోనా కారణంగా గతేడాది పార్లమెంటు సమావేశాలు పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు సైతం కరోనా బారినపడడంతో వర్షాకాల సమావేశాలను బాగా కుదించారు. శీతాకాల సమావేశాలను కూడా నిర్వహించలేదు. కాగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ నిర్వహణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గత సమావేశాల్లో సమయాభావం కారణంగా క్వశ్చన్ అవర్ నిర్వహించలేదు.

  • Loading...

More Telugu News