vijaya shanti: ఇదే తీరున వ్యవహరిస్తే మీ నాయకులు అక్కడ తిరగలేని పరిస్థితులు వ‌స్తాయి: విజ‌య‌శాంతి

vijaya shanti slams trs
  • అరాచకం హద్దు మీరుతోంది
  • పోరాటాల ఖిల్లా ఉమ్మడి ఓరుగల్లు
  • ప్ర‌భుత్వం అక్క‌డ  దుర్మార్గాలకు పాల్ప‌డుతోంది
  • జిల్లా ప్రజల ప్రతిఘటనలు అంతకు రెట్టింపు స్థాయిలో ఉంటాయి
టీఆర్ఎస్ ప్ర‌భుత్వ తీరుపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు లాఠీలతో చిత‌గ్గొట్టిన వార్త‌ను ఓ టీవీ చానెల్ లో ప్ర‌సారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను విజ‌య‌శాంతి పోస్ట్ చేశారు.  

'అరాచకం హద్దు మీరుతోంది. పోరాటాల ఖిల్లా ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలలో ఈ దుర్మార్గాలకు జిల్లా ప్రజల ప్రతిఘటనలు కూడా అంతకు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే తీరున వ్యవహరిస్తే మీ నాయకులు కూడా అక్కడ తిరగలేని పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. ఉద్యమాలకు ముందుండి పోరాడే నాలాంటి కార్యకర్తలం బీజేపీలో అసంఖ్యాకంగా ఉన్నామని గుర్తు పెట్టుకోండి' అని విజయశాంతి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.
vijaya shanti
BJP
TRS

More Telugu News